'షావోమి' స్మార్ట్ టీవీల ధరలు తగ్గాయి..

'షావోమి' స్మార్ట్ టీవీల ధరలు తగ్గాయి..

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ తన వినియోగదారులకు కొత్త సంవత్సర కానుకను అందించింది. ఎల్ఈడీ టీవీల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది.
షావోమీకి 'ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 4ఎ', 'ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4సి ప్రొ', 'ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4ఎ ప్రొ' టీవీలపై దాదాపు రూ.1000 నుంచి రూ.2000 వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. భారత ప్రభుత్వం టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో షియోమి ఈ నిర్ణయం తీసుకుంది.