తగ్గిన 'రెడ్‌మీ 6' స్మార్ట్‌ఫోన్ ధ‌ర

తగ్గిన 'రెడ్‌మీ 6' స్మార్ట్‌ఫోన్ ధ‌ర

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ 'రెడ్‌మీ 6' స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ను త‌గ్గించింది. రెడ్‌మీ 6కు సంబందించిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్ ధ‌ర‌ను రూ.500 త‌గ్గించింది. తగ్గిన ధరతో ఈ ఫోన్‌ రూ.7,999 ధ‌ర‌కు వినియోగదారులకు అందుబాటులో ఉంది. 3జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర‌ను కూడా రూ.500 త‌గ్గించడంతో.. రూ.8,999 ధ‌ర‌కు కొనుగోలు చేయొచ్చు. త‌గ్గింపు ధ‌ర‌కు ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌ల‌లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఫీచ‌ర్లు:

# 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
# మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
#12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
# 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
#  3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
# ఫేస్ అన్‌లాక్‌
# ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌