షియోమి... రేపే డెలివరీ

షియోమి... రేపే డెలివరీ

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. బుక్‌ చేసిన మరుసటి రోజే ఫోన్‌ను డెలివరి చేసే సదుపాయం ప్రారంభించింది. 150 నగరాల్లో 'గ్యారంటీడ్‌ నెక్స్ట్‌ డే డెలివరి' సర్వీస్‌ను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ కామర్స్‌ పోర్టల్ MI.Com లో బుక్‌ చేసిన వారికి ఈ సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఎక్స్‌ప్రెస్‌ డెలివరీ కోసం ఖాతాదారుడు రూ. 49 చెల్లించాల్సి ఉంటుంది. MI.Com  ద్వారా కంపెనీ ఏకంగా 90కి పైగా వస్తువులను ఆఫర్‌ చేస్తోంది. ప్రయోగాత్మకంగా బెంగళూరులో ఉచితంగా 'మరుసటి రోజు' డెలివరి విజయవంతంగా ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఆన్‌లైన్‌ అమ్మకాల్లో అమెజాన్‌, ఫ్లిప్‌ కార్టులకు గట్టి పోటీ ఇస్తున్న జియోమి... కొత్త ఆఫర్‌ వినియోగదారులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.