యాత్ర టీజర్ ఎప్పుడో తెలుసా..?

యాత్ర టీజర్ ఎప్పుడో తెలుసా..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా యాత్ర.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.  ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేశారు.  సింగిల్ షెడ్యూల్ లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకొని వర్క్ చేస్తున్నారు.  మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం వైఎస్సాఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను యూనిట్ ప్రకటించింది.  వైఎస్సాఆర్ పుట్టినరోజైన జులై 8 న టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.  అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.  ప్రస్తుతం హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.  మమ్ముట్టి, జగపతిబాబు, సుహాసిని, అనసూయ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాను  విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మిస్తున్నారు.