హాజీపూర్ బాధిత కుటుంబాలతో కలెక్టర్ చర్చలు

హాజీపూర్ బాధిత కుటుంబాలతో కలెక్టర్ చర్చలు

యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ లో బాలికలపై అత్యాచారం చేసి హత్యలకు పాల్పడ్డ సైకో శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగన విషయం తెలిసిందే. శ్రీనివాస్‌ ను ఉరి తీయకపోతే.. తాము కూడా బావిలోనే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. గత 2 రోజులుగా బాధిత కుటుంబీకులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు శాంతియుత నిరాహారదీక్ష చేపట్టారు. శుక్రవారం అర్థరాత్రి బాధితులపై, మద్దతుదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపధ్యంలో హజీపూర్ బాధిత కుటుంబసభ్యులతో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ చర్చలు జరిపారు. వారి సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. చర్చల అనంతరం బాధిత కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని అన్నారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాజీపూర్ నుంచి మాచనపల్లి గ్రామానికి మధ్య బ్రిడ్జ్ నిర్మాణం జరపాలని కలెక్టర్ కోరామని తెలిపారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందచేశామని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.