ఆ భామకు నర్తనశాలైనా కలిసొస్తుందా..?

ఆ భామకు నర్తనశాలైనా కలిసొస్తుందా..?

నాగశౌర్య హ్యాట్రిక్ పై కన్నేశాడు. ఛలో మంచి విజయం సాధించడం ఆ తరువాత వచ్చిన అమ్మమ్మగారిల్లు ఒక మంచిసినిమాగా పేరు తెచ్చుకోవడంతో.. నర్తనశాల సినిమాకు హైప్ క్రియేట్ అయింది.  దీనికి తగ్గట్టుగానే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి.  పాటలు వినసొంపుగా ఉండటంతో.. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది.  నర్తనశాల సినిమాలో నాగశౌర్య  గే క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు.  ఇదే అసలు ట్విస్ట్.  టైటిల్ కు తగ్గట్టుగానే కథ ఉంటుందని చూచాయగా అర్ధం అయింది.  

ఇందులో ఇద్దరు హీరోయిన్లు.  ఒకరు కాశ్మీరకాగా యామిని భాస్కర్ రెండో హీరోయిన్.  యామిని గతంలో సంగీత దర్శకుడు కోటి కుమారుడితో ఓ సినిమా చేసింది.  ఆ సినిమా ప్లాప్ కావడంతో కలిసిరాలేదు.  రెండు సినిమాలు చేసిన లాభంలేకపోయింది.  అటు తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నది.  ఇప్పుడు నాగశౌర్య నర్తనశాలలో హీరోయిన్ గా చేస్తున్నది.  గ్లామర్ రోల్స్ కు ఏమాత్రం అడ్డు చెప్పదని పిచ్చిపిచ్చిగా నచ్చావురా సాంగ్ ద్వారా అర్ధమౌతున్నది.  ఈ సినిమాతోనైనా యామిని లక్ మారుతుందేమో చూడాలి.  నర్తనశాల ఆగస్టు 30 వ తేదీన రిలీజ్ అవుతున్నది.