డీజీపీకి యామిని సాధినేని ఫిర్యాదు..

డీజీపీకి యామిని సాధినేని ఫిర్యాదు..

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని.. డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ సవాంత్‌తో భేటీ అయిన ఆమె... సైబర్ క్రైమ్ పై విచారణ చేయాల్సింది ఫిర్యాదు ఇచ్చారు. తన పేరుతో ఫేస్‌బుక్ పేజీని ఓపెన్ చేసి.. ఆ పేజీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై తాను చేసినట్టుగా అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారని.. దీంతో కొంతమంది వ్యక్తులు తన పేరును మిస్ యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. దీనిపై విచారణ జరిపి.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన యామిని.. తనకు వ్యవస్థపై నమ్మకం ఉందని.. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఒక మహిళ ఉండటం.. తనకు న్యాయం చేకూరుతోందన్న నమ్మకం కలిగిందని.. తగురీతిన స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.