పెట్రో పాపం కేంద్రానిదే...

పెట్రో పాపం కేంద్రానిదే...

రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మధ్య తరగతి ప్రజలపై ఎక్కువ భారం పడుతుందన్నారు మంత్రి యనమల రామకృష్ణుడు. ఈ రోజు ఆయన అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఇంటర్నేషనల్ మర్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ధరలు పెంచడం దారుణమన్నారు. దీని వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతుంది, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల మీద ఎక్కువ భారం పడుతుందని తెలిపారు. అదే క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు తగ్గించమని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం సరైంది కాదన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు.. ఆ భారం ప్రజలపై పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని యనమల స్పష్టం చేశారు.