బడ్జెట్‌పై యనమల సెటైర్లు

బడ్జెట్‌పై యనమల సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సెటైర్లు వేశారు ఏపీ మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు... ప్రభుత్వం రూ.48 వేల కోట్లు అప్పు చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. అప్పుల గురించి నీతులు చెప్పిన జగన్.. ఇప్పుడు అప్పులనే నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. సున్నా వడ్డీ పథకంపై గొప్పలు చెప్పిన వైసీపీ సర్కార్... ఆ పథకానికి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. సోషల్ వెల్ఫేర్‌కు నిధుల కోత పెట్టారని.. ఇరిగేషన్‌కు రూ. వెయ్యి కోట్లు తగ్గించారన్నారు. స్కీమ్‌లకు వైఎస్ఆర్, వైఎస్ జగన్ పేర్లు తప్ప.. వేరే పేర్లు లేవా? అంటూ ఫైర్ అయ్యారు యనమల రామకృష్ణుడు. "నేను విన్నాను.. నేనున్నాను.. కాదు.. నేను తిన్నాను అంటే కూడా బాగుండేది'' అంటూ సెటైర్లు వేశారు యనమల.