ఐటీ దాడులతో టీడీపీకి సంబంధం ఏముంది ?

ఐటీ దాడులతో టీడీపీకి సంబంధం ఏముంది ?

మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌కు టీడీపీతో సంబంధమేంటని ప్రశ్నించారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. అతనొక ఉద్యోగి మాత్రమేన్న ఆయన పిఏలు, పిఎస్‌లతో, పార్టీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. 40ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10-15 మంది పిఏలుగా పని చేశారని తెలిపారు. శ్రీనివాస్‌పై దాడుల పేరుతో టీడీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారాయన. తెలంగాణలో ఇన్ ఫ్రా కంపెనీపై దాడిని పార్టీకి అంటగట్టడం హేయమని అన్నారు. దాడులు జరిగిన ఇన్ ఫ్రా కంపెనీకే జగన్ కాంట్రాక్ట్‌లు ఇచ్చారన్నారు. ఇక ఐటీ రైడ్స్‌లో చంద్రబాబు మాజీ పియస్ శ్రీనివాస్ ఇంటిలో 2 వేల కోట్లు దొరికినట్టు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు టీడీపీ నేత బోండా ఉమ. శ్రీనివాస్ ఇంట్లో 70 నుంచి 80 వేలు మాత్రమే పట్టుబడ్డాయన్నారు. వేరే చోట్ల జరిగిన ఐటీ తనిఖీల్లో టీడీపీకి సంబంధం లేదన్నారు. అవినీతి మరకను టీడీపీకి అంటించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు బోండా ఉమ.