శ్రీనివాస్ ఇంట్లో దొరికింది రూ.80 వేలే..!

శ్రీనివాస్ ఇంట్లో దొరికింది రూ.80 వేలే..!

దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో జరిగిన ఐటీ దాడులకు సంబంధించిన వివరాలను ప్రకటించారు ఆదాయపన్నుశాఖ అధికారులు.. అయితే, ఐటీ శాఖ అధికారుల ప్రకటిన తర్వాత.. వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు.. కేవలం చంద్రబాబు నాయుడుకు పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తే దగ్గరే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయని.. ఇక, చంద్రబాబును పట్టుకుంటే ఎన్ని వేల కోట్లు దొరుకుతాయో? అని ప్రశ్నించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక, సజ్జల కామెంట్లపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు.. చంద్రబాబు మాజీ సీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దొరికింది కేవలం రూ. 80 వేలే అన్నారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు... రూ.2 వేల కోట్లు దొరికాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డ ఆయన.. వేర్వేరు చోట్ల జరిగిన ఐటీ దాడులతో టీడీపీకి సంబంధంలేదన్నారు. మరోవైపు, ఐటీ దాడుల సాకుతో టీడీపీపై వైసీపీ విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు యనమల రామకృష్ణుడు.. పీఎస్ శ్రీనివాస్‌తో టీడీపీకి ఏం సంబంధం ఉంటుంది? అని ప్రశ్నించారు.