సాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి..!

సాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి..!

13 రోజుల పాటు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిడ్ పదవిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు... విజయసాయిరెడ్డికి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిపై అభ్యంతరం తెలిపిన ఆయన.. ఢిల్లీలో లాబీయింగ్ కోసమే విజయసాయిరెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారని.. తప్పుడు జీవో ఇచ్చి.. గుట్టురట్టు కావడంతో ఉత్తర్వులు రద్దు చేశారని విమర్శించారు. ఇక ఆర్డినెన్స్ ద్వారా విజయసాయిరెడ్డికి పదవి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు యనమల... ఓ వ్యక్తి కోసం ఆర్డినెన్స్ జారీ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించిన ఆయన... వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆర్డినెన్స్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. విజయసాయిరెడ్డికి పదవి కట్టబెట్టడంపై ఫిర్యాదు చేయనున్నట్టు ప్రకటించారు యనమల రామకృష్ణుడు.