ఎమ్మెల్సీగా యనమల ప్రమాణస్వీకారం !

ఎమ్మెల్సీగా యనమల ప్రమాణస్వీకారం !

 

మంత్రి యనమల ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు.  మండలి చైర్మన్ షరీఫ్ యనమల చేత ప్రమాణస్వీకారం చేయించారు.  ఈ సందర్బంగా యనమల మాట్లాడుతూ '1982 లో మొదటిసారిగా ఎమ్మెల్యే గా  ఎన్నికైయ్యాను.  ఎన్టీఆర్ మొదటి కేబినెట్లోలో మంత్రిగా పనిచేశాను.  43 సవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండే అవకాశం కలిగింది.  స్పీకర్ గా ఉన్న సమయంలో దేశంలో మొదటి సారిగా ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేశాను.  మేము పోరాటం చేయడం వల్లే వీవీప్యాట్లను తీసుకొచ్చారు.  అనేక దేశాలు ఈవీఎంలు అమలు చేసి తర్వాత వెనక్కి తగ్గాయి.  టెక్నాలజీలో ముందున్న జపాన్ లాంటి దేశంలో కూడా ఈవీఎంల వాడకాన్ని నిషేదించారు' అని అన్నారు.