ఎక్కడికి పారిపోలే...మీడియా ముందుకొచ్చిన యరపతినేని

ఎక్కడికి పారిపోలే...మీడియా ముందుకొచ్చిన యరపతినేని

పల్నాడులో దారుణ పరిస్థితులు ఉన్నాయని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు గుంటూరులోని టీడీపీ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ అక్రమ కేసులు, దాడులతో వేధిస్తున్నారన్నారు. సరస్వతి సిమెంట్‌ భూముల కోసమే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. సిమెంట్ ఫ్యాక్టరీకి అడ్డు తొలగించుకునేందుకే తనపై ఈ అక్రమ కేసేులు బనాయించారని ఆరోపించారు. మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నానన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదంటున్న యరపతినేని గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో వైసీపీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ మద్దతుదారుల ఇళ్లు కూలగొట్టారని, వందలాది కుటుంబాలు గ్రామాలు విడిచి పెట్టి వెళ్లిపోయే పరిస్థితి వారే సృష్టించారని అన్నారు.