'కేజీఎఫ్ 2' టీజర్ వచ్చేది అప్పుడేనా.. ?

'కేజీఎఫ్ 2' టీజర్ వచ్చేది అప్పుడేనా.. ?

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన "కేజీఎఫ్" సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈసినిమా విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాఫ్టర్ 2గా వస్తున్న ఈ సినిమాలో కోసం అభిమానులతోపాటు ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ చాఫ్టర్ 2 తెరకెక్కిస్తున్నారు.

యష్ పుట్టిన రోజున లేదా సంక్రాంతి రోజున అయినా చిత్ర వర్గాలు ఫస్ట్‌లుక్ టీజర్‌ని రిలీజ్ చేస్తాయని యష్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే ఎదురైంది.కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమైందని అందువల్లే టీజర్ ను విడుదల చేయలేకపోయామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీజర్‌ని ఈ నెల 21న ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. ఇక మొదటి పార్ట్ 200 కోట్లు వసూల్ చేయడం తో పార్ట్ 2 పైకూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.