వేర్పాటువాద నేత యాసిన్ మలిక్ జెకెఎల్ఎఫ్ పై నిషేధం

వేర్పాటువాద నేత యాసిన్ మలిక్ జెకెఎల్ఎఫ్ పై నిషేధం

వేర్పాటువాద నేత యాసిన్ మలిక్ జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్ఎఫ్) పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద యాసిన్ మలిక్ జెకెఎల్ఎఫ్ ని కేంద్ర సర్కార్ బ్యాన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సంస్థ జమ్ముకశ్మీర్ లో వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నందుకు నిషేధిస్తున్నట్టు చెప్పారు. 

వేర్పాటువాదులపై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధం) చట్టంలోని పలు సెక్షన్ల కింద జెకెఎల్ఎఫ్ పై నిషేధం విధించినట్టు  కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలిపారు. 

జెకెఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మలిక్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన జమ్ములోని కోట్ బల్వల్ జైల్లో నిర్బంధంలో ఉన్నారు. ఈ నెలలో జమ్ముకశ్మీర్ లో నిషేధించిన రెండో వేర్పాటువాద సంస్థ జెకెఎల్ఎఫ్. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం జమాత్-ఎ-ఇస్లామీని నిషేధించింది.