ఆసక్తి రేపుతున్న యాత్ర బయోపిక్ అప్డేట్..!!

ఆసక్తి రేపుతున్న యాత్ర బయోపిక్ అప్డేట్..!!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర.  ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడం కాదు, సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది.  ఫిబ్రవరి 8 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఫిబ్రవరి 1 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  

హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. వైఎస్ బయోపిక్ కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ ఎవరు అన్నది ఇంకా తెలియలేదు.  చీఫ్ గెస్ట్ ఎవరు అనే విషయాన్ని యూనిట్ ప్రకటిస్తే.. మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది.