ఎన్టీఆర్ గురించి 'యాత్ర' దర్శకుడు !

ఎన్టీఆర్ గురించి 'యాత్ర' దర్శకుడు !

దర్శకుడు మహిళ వి రాఘవ్ 'యాత్ర' పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా రేపే రిలీజ్ కానుంది.  ఈ సినిమా పట్ల ఒక వర్గం ప్రేక్షకుల్లో కొంత వ్యతిరేకత మొదటి నుండి ఉంది.  దీని గురించి మహి వి రాఘవ్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ ఈ మట్టి వారసులు.  గొప్ప కీర్తిని వదిలి వెళ్లారు' అన్నారు. 

అలాగే మన అభిప్రాయ బేధాలతో వారిని అవమానపరచవద్దు.  నేను వైఎస్సార్, చిరంజీవికి అభిమానిని అయినంత మాత్రాన ఇతరుల పట్ల దేవర్షాన్ని పెంచుకుంటానని అర్థం కాదు.  ఈ సినిమాను ఇతర సినిమాలతో పోల్చకండి.  వైఎస్సార్ ప్రయాణాన్ని సంతోషంగా ఆస్వాదించండి' అంటూ విజ్ఞప్తి చేశాడు.