యాత్ర సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే..!!
వైఎస్ ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో మమ్మూట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకు సింగిల్ కట్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.
సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమాలోని చాలా సీన్స్ హార్ట్ టచ్ గా ఉంటాయట. క్లైమాక్స్ కంటతడి పుట్టిస్తుందట. రేసీ స్క్రీన్ ప్లే తో సినిమా చాలా స్పీడ్ గా పూర్తవుతుందని,బయోపిక్ అయినప్పటికీ ఒక కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 8 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)