నాయకుడిగా కాదు ప్రజానాయకుడిగా గెలవాలి

నాయకుడిగా కాదు ప్రజానాయకుడిగా గెలవాలి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహి రాఘవ దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కుతోంది. మలయాళం స్టార్ హీరో మమ్మూట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది.  మనసుకు హత్తుకునే డైలాగులతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.  నాయకుడిగా గెలిచాం.. ప్రజానాయకుడిగా గెలవాలి.. అందుకోసం ఈ గడపదాటి.. ప్రతి గడప ముందుకు వెళ్ళాలి.  అనే డైలాగులు మనసుకు హత్తుకుంటాయి.  

అధిష్ఠానాన్ని ఎదిరించి ఆయన తీసుకున్న నిర్ణయాలను సమర్ధించుకుంటూ.. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించడానికి ఏముందని చెప్పి ప్రజలకోసం ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడను అని చెప్పకనే చెప్పారు.  మనసులు గెలిచావ్ రాజశేఖర్ రెడ్డి.. ఈసారి నా ఓటు నీకే.. నీ పార్టీకి కాదు అని చెప్పించడం కొసమెరుపు.