ఎన్టీఆర్ కంటే ముందే వైఎస్సార్ !

ఎన్టీఆర్ కంటే ముందే వైఎస్సార్ !

తెలుగు ప్రజానీకం మర్చిపోలేని నాయకుల్లో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడ ఉంటారు.  ఇప్పుడు వీరి జీవితాల ఆధారంగానే రెండు బయోపిక్స్ రూపొందుతున్నాయి.  వీటిలో ఎన్టీఆర్ జీవితకథను 'ఎన్టీఆర్' పేరుతో బాలక్రిష్ణ, దర్శకుడు క్రిష్ కలిసి చేస్తుండగా వైఎస్సార్ జీవితగాథను 'యాత్ర' పేరుతొ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. 

వీటిలో ఎన్టీఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా రిలీజవుతుండగా అంతకంటే ముందే వైఎస్ బయోపిక్ 'యాత్ర' ఈ ఏడాది డిసెంబర్ 21న వైఎస్.జగన్ పుట్టినరోజు కానుకగా విడుదలకానుంది.  ఈ చిత్రాన్ని విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డిలు నిర్మిస్తున్నారు.