18 జూన్ `యాత్ర` మొదలు
2019 ఎన్నికల వేళ .. రాజకీయ నాయకుల బయోపిక్‌లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్, వైయస్సార్ బయోపిక్‌పైనే జనం కళ్లన్నీ. ఆ సినిమాలకు సంబంధించి ఏ సమాచారం లీకైనా.. తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వైయస్సార్ బయోపిక్ పై దర్శకుడు మహి.వి.రాఘవ్ పూర్తి సంసిద్ధతతో ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే టైటిల్ పాత్రకు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని ఎంపిక చేసుకుని ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు.
అటుపై ఈ సినిమాలో కీలక పాత్రలైన వైయస్ జగన్, వైయస్ విజయమ్మ, షర్మిల కోసం ఆర్టిస్టుల్ని వెతుకుతున్న సంగతి తెలిసిందే. తెలుగు నటీనటులను సంప్రదిస్తే, రాజకీయాలతో ముడిపడిన అంశం కాబట్టి వెనకాడుతున్నారన్న సమాచారం ఉంది. ఇకపోతే జూన్ 18 నుంచి యాత్ర రెగ్యులర్ చిత్రణ ప్రారంభించేందుకు దర్శకుడు ప్లాన్ సిద్ధం చేశారని తెలుస్తోంది. కేవలం 3,4 షెడ్యూల్స్‌లో పూర్తి చేసి అటుపై 2019 ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)