యాత్ర టీజర్ రిలీజ్ ఫిక్స్

యాత్ర టీజర్ రిలీజ్ ఫిక్స్

వైఎస్సాఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర.  ఈ సినిమా ఈనెల 21 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనుకోని కారణాల వలన ఫిబ్రవరి 8 వ తేదీకి వాయిదా పడింది.  అంతరిక్షం, పడిపడిలేచే మనసు సినిమాలకు పోటీ ఇస్తుందని అనుకుంటే.. తప్పుకోవడంతో ఆ రెండు సినిమాలకు అవకాశంగా మారింది.  

డిసెంబర్ 21 న వైఎస్ జగన్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  డిసెంబర్ 21 వ తేదీ ఉదయం 8 గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.  మమ్మూట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మహి దర్శకత్వం వహిస్తున్నారు.