ఏపీ కేబినెట్‌పై స్పష్టత..!

ఏపీ కేబినెట్‌పై స్పష్టత..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంపై ఇవాళే క్లారిటీ రానుంది... తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటలకు వైసీఎల్పీ భేటీ కానుంది... ఈ సమావేశానికి ముఖ్యమంత్రితో సహా 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రివర్గంపై ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వనున్నారు సీఎం. ప్రాంతాలు, వర్గాల వారీగా మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. 25 మందితో పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.