టీడీపీకి పోటీగా వైసీపీ కూడా ''ఛలో ఆత్మకూరు'' !

టీడీపీకి పోటీగా వైసీపీ కూడా ''ఛలో ఆత్మకూరు'' !


ఓవైపు టీడీపీ ఛలో ఆత్మకూరుకు సిద్ధమవుతుంటే ఆ పార్టీకి పోటీగా వైసీపీ కూడా ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. కోడెల, యరపతినేని బాధితులతో ఆత్మకూరు వెళ్తామని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రకటించారు. అక్కడికి వచ్చే టీడీపీ బాధితులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పల్నాడులో టీడీపీ టెన్షన్ వాతావరణం సృష్టిస్తుందని పేర్కొన్నారు అంబటి. కోడెల, యరపతినేని కేసుల నుండి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమే ఈ పల్నాడు పర్యటనలు అని ఆయన పేర్కొన్నారు అంటున్నారు వైసీపీ నేతలు. అందుకే ఆత్మకూరు ఇష్యూ తెరపైకి తెచ్చారంటున్నారు.

టీడీపీ నేతల చేతుల్లో మోసపోయిన బాధితులందర్నీ ఆత్మకూరు తీసుకువెళ్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు చేస్తున్న హత్యారాజకీయాలను అక్కడే ఎండకడతామని ఆయన పేర్కొన్నారు.  మరోపక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు ఛలో ఆత్మకూరు కార్యక్రమం షెడ్యూల్ సిద్దమయింది. చలో ఆత్మకూరులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. రేపు ఉదయం 8 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు చంద్రబాబు గుంటూరు అరండల్‌పేట పునరావాస శిబిరానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆత్మకూరు వెళ్లనున్నారు.