ఎలాంటి సమస్య ఉన్నా.. మిస్డ్ కాల్ ఇవ్వండి: రజిని

ఎలాంటి సమస్య ఉన్నా.. మిస్డ్ కాల్ ఇవ్వండి: రజిని

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. ముఖ్యంగా వైసీపీలో చేరికలు బాగా జరగడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈ జాబితాలో చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి విడదల రజిని కూడా ఉన్నారు.

గురువారం విడదల రజిని నామినేషన్ ను దాఖలు చేశారు. అనంతరం రజిని ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయిందన్నారు. ఓటర్లకు టీడీపీ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేశారని, రైతులను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఇప్పుడు రైతులంతా వైసీపీ వైపు చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని రజిని ధీమా వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా.. ఒక చిన్న మిస్డ్ కాల్ ఇవ్వండి, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కస్తా. వచ్చే ఎన్నికల్లో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పిస్తే.. ప్రజలకు మరిన్ని మంచి పనులు చేసేలా కృషి చేస్తామని రజిని హామీ ఇచ్చారు.