చంద్రబాబుపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

చంద్రబాబుపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. అధికార పక్షం ఏకాగ్రీవాలకు సంబందించిన అంశం మీద విపక్ష పార్టీలు ఏకంగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర శాఖ కార్యదర్శి సి.హెచ్.సాయిరామ్ ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడంపై ఎస్ఈసీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి  విరుద్దంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు. ఎన్నికల నియామవళికి విరుద్దంగా వ్యవహరించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోకుంటే..చంద్రబాబు పక్షపాతిగా ఉన్నారన్న ఆరోపణలు నిజమవుతాయని ఫిర్యాదులో వైసీపీ పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు కొవిడ్ వ్యాక్సినేషన్ తరువాత జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా దానిని కాదని వివాదాస్పదంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఎన్నికలు జరిపి ఇస్తుండడం విచారకరమని లేఖలో పేర్కొన్నారు. అందులోనూ మీకు సంక్రమించని అధికారాలను వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శత్రువుల పరిగణిస్తున్న మీరు చంద్రబాబు మీద, ఆయన పార్టీ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.