బీసీ గర్జనకు కృష్ణయ్యకు ఆహ్వానం

బీసీ గర్జనకు కృష్ణయ్యకు ఆహ్వానం

ఏపీలో బీసీల డిమాండ్ల సాధన కోసం వైసీపీ ఆధ్వర్యంలో ఈనెల 17న ఏలూరులో జరిగే బీసీ గర్జనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. ఏపీలో బీసీ గర్జన సభకు ఆహ్వానించడానికి వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ అధ్యయన కమిటీ చైర్మెన్ జంగా కృష్ణమూర్తి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్ లో ఆర్. కృష్ణయ్య నివాసానికి వచ్చారు. ఏపీలోని బీసీల డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈనెల 17న ఏలూరులో జరిగే బీసీ గర్జన సభకు కృష్ణయ్యను ఆహ్వానించారు.