తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. మొదటిసారిగి ప్రగతి భవన్ కు వచ్చిన ఆయనకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి జగన్ ను లోపలికి ఆహ్వానించారు. అనంతరం శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందచేశారు. ఈనెల 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్, కుటుంబసభ్యులను జగన్ ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతపై ఇరువురు చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన అనంతరం తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ నగరంలో పలుచోట్ల భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.