ఉండవల్లి నివాసానికి చేరుకున్న జగన్

ఉండవల్లి నివాసానికి చేరుకున్న జగన్

గురువారం వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కాబోయే సీఎం జగన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి జగన్‌ బయల్దేరారు. విమానాశ్రయం సహా జగన్‌ నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.