గుంపులో పవన్ ఒకరు...

గుంపులో పవన్ ఒకరు...

ఏపీ సీఎం చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఒక గుంపు బయలుదేరింది..ఆ గుంపులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీ ఏర్పాటు చేసి నడపలేక చేతులెత్తేసిన ప్రజారాజ్యం పార్టీలో పవన్ భాగస్వామి కాదా? వర్షాకాలంలో పుట్టే పుట్టగొడుగు లాంటిది జనసేన. చంద్రబాబును రక్షించడానికి పుట్టిన కవలపిల్లలు జనసేన, లోక్ సత్తా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలోని అవినీతి గురించి లోక్ సత్తా మాట్లాడదు.. చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ లోక్‌సత్తా అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా వైసీపీ అధినేత జగన్ ను ఇబ్బందులు పెట్టినా.. ఆయన దైర్యంగా ఎదుర్కొన్నారు. జగన్ ను విమర్శించే స్థాయి పవన్ ది కాదన్నారు.

నధుల అనుసంధానం పేరుతో ఎన్నికల ఆర్భాటం చేస్తున్నారు. టీడీపీ దేవాదుల ప్రాజెక్టు అనుసంధానం పేరుతో 2004 ఎన్నికలలో హడావుడి చేశారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది కనుక మళ్లీ ఆర్భాటాలు చేస్తున్నారని అంబటి తెలిపారు. గోదావరి, పెన్నా అనుసంధానం పేరుతో కాంట్రాక్టు ఇచ్చి కమిషన్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు దోచేశారన్నారు. ఎకనమిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో సాగు విస్తీర్ణత తగ్గిందని అంబటి చెప్పుకొచ్చారు.