ఇచ్చిన హామీలను అడగడం తప్పా: రాంబాబు

ఇచ్చిన హామీలను అడగడం తప్పా: రాంబాబు

ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగడం తప్పా అని వైసీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. హక్కుల కోసం సమ్మె చేస్తున్న నాయిబ్రాహ్మణుల చర్చలు విఫలమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో మాట్లాడిన విధానం ధారుణంగా ఉందని విమర్శించారు. నాయి బ్రాహ్మణులు ప్రశాంతంగా వారి పనులు వారు చేసుకుంటారు.. అలాంటి వారిపై కొప్పడడం సబబు కాదన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే.. ఆయన  ప్రస్టేషన్ లో ఉండి నాయి బ్రాహ్మణులపై పడ్డట్టుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. గతంలో అగ్నికుల క్షత్రీయులపై కూడా సీఎం విరుచుకుపడ్డారని గుర్తు చేశారు.

ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగడం.. సమస్యలు పరిష్కరించమని అడగడం తప్పా అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. హక్కులు అడుగుతూ డౌన్ డౌన్ అంటే తప్పా అని ఆయన ప్రశ్నించారు. కులవృత్తి చేసుకునే వారిపై దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాలను అణచి వేయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇంటలీజెన్స్ బ్యూరో వెంకటేశ్వరరావుని అడ్డుపెట్టుకుని పోలీసులతో అన్యాయంగా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నిన్న పెధ్ద ఎత్తున గొడవ జరగడంతో కొంత మంది నాయి బ్రాహ్మణులను పిలిచి సమ్మె విరమింపచేస్తున్నామని చెప్పించారు అని రాంబాబు విమర్శించారు. ఇప్పటికైనా నాయి బ్రాహ్మణులకు న్యాయం చేసే పార్టీ.. వైసీపీ పార్టీనే అని నమ్మాలన్నారు. చంద్రబాబును రాజకీయాలకు దూరంగా పెట్టేందుకు నాయిబ్రాహ్మణులు వైసీపీకి మద్దతు తెలపాలి అని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.