ఓటమికి కారణాలు వెతుకుతున్నారు..

ఓటమికి కారణాలు వెతుకుతున్నారు..

ఏపీ సీఎం చంద్రబాబు ఓటమికి కారణాలను వెతుకుతున్నారని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ విచ్చిన్నం అవుతుందనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఈవీఎంలతోనే అని ఆయన గుర్తుచేశారు. పోలింగ్‌ సరళి చూసి భయపడ్డ చంద్రబాబు.. ఓటు వేసిన గంటకే నా ఓటు ఎటుపోయిందో అంటూ మాట్లాడారని అన్నారు. ఈవీఎంలే ఫైనలని.. వీవీప్యాట్లని ట్రయల్‌గా తీసుకున్నారని నాగిరెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికల సంఘం, సీఎస్‌పై లేనిపోని ఆరోపణలకు చేస్తున్నారని మండిపడ్డారు. విజయంలేకపోతే పార్టీని నడపలేమనే భయంతో చంద్రబాబు ఉన్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గడిచిన ఐదేళ్లు ప్రజలతో గడిపారని.. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడారని స్పష్టం చేశారు.