టీడీపీలో ఆయనపై నమ్మకం సన్నగిల్లింది

టీడీపీలో ఆయనపై నమ్మకం సన్నగిల్లింది

టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నమ్మకం సన్నగిల్లిందని వైసీపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. టీడీపీలో ముసలం మొదలైందని, ఒక గ్రూపు బైబై బాబు అంటున్నారని తెలిపారు. లోకల్‌ బాడీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఉండదనే భయాందోళనతో టీడీపీ నేతలు ఈవీఎంలపై నెపం నెడుతున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడని విమర్శించారు. డీజీపీ ఠాకూర్‌పై వైసీపీ అనేక ఫిర్యాదులు చేసినా బదిలీ చేయలేదన్నారు. చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారని, ఎన్నికలకు ముందు ఈవీఎంలు వద్దని, టీడీపీ ఎందుకు చెప్పలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు బాగా తెలుసునన్నారు. బాబు అధికారంలో ఉండి చెయ్యరాని పనులు చేశారని ఆరోపించారు. ఆయన విడుదల చేసిన ఆడియో.. గ్యాంబ్లింగ్‌ ప్రోత్సహించేలా ఉందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.