చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీని తప్పుపట్టడమే..

చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీని తప్పుపట్టడమే..

రాష్ట్రంలో మొదటి విడతలో ఉద్దేశ పూర్వకంగానే ఎన్నికలు పెట్టారని చంద్రబాబు ఆరోపించడం ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడమేనని వైసీపీ నేత, మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసహనంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల రగడ జరుగుతోందని అన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆపద్ధర్మ ముఖ్మమంత్రి చంద్రబాబు చేస్తున్న పనులేవీ గతంలో జరుగలేదన్నారు.అవివేకులే ఇలాంటివి చేస్తారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ గెలుస్తారని, సీఎం అవుతారని అర్థమయ్యే చంద్రబాబు ఇటువంటి రగడ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పర్యటనకు చంద్రబాబు వెళ్తే ఆయన వెంట నిబంధనల ప్రకారం ఏ అధికారులు వెళ్ళలేదని అన్నారు. దాంతో అసహనానికి గురై చంద్రబాబు.. సీఎస్, సీనియర్ అధికారులపై పలు అభ్యంతర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని, వైసీపీ గెలుస్తుందని చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.