చంద్రబాబు అవినీతి, పుట్టలు బద్ధలవుతున్నాయి..

చంద్రబాబు అవినీతి, పుట్టలు బద్ధలవుతున్నాయి..

ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి, పుట్టలు బద్ధలవుతున్నాయని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చివేస్తే.. టీడీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమాలను చూస్తూ ఊరుకోవాలా అంటూ నిలదీశారు. చంద్రబాబు ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. ఆయన విధానాల వల్ల విద్యుత్‌ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని మండిపడ్డారు. రూ.18 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిఉందని, టీడీపీ నేతలు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు.  అక్రమ కట్టడాలపై సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటే.. టీడీపీ నేతలు వాటిని ఒక యుద్ధంలా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని, పోలవరం, భూకేటాయింపులు సహా అన్నింటిలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. మరో 25 ఏళ్లు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశంలేదని ఎద్దేవాచేశారు.