సీఎం బ్లాక్ ను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి

సీఎం బ్లాక్ ను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తికావోచ్చాయి. జగన్ ప్రమాణస్వీకారం అనంతరం మోడీ ప్రమాణ స్వీకారానికి హజరయ్యేందుకు ఢిల్లీకి వెళతారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత శనివారం నుంచే సచివాలయంలో కొత్త సీఎంగా జగన్ అడుగుపెడుతారు. ఇప్పటికే సచివాలయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం ఛాంబర్‌, కేబినెట్‌ హాల్‌, హెలిపాడ్, సీఎం కాన్వాయ్ రూట్‌లను ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. జగన్‌ నేమ్‌ ప్లేట్‌ను కూడా సుబ్బారెడ్డి పరిశీలించి ఆమోదించారు.