చంద్రబాబుకు అర్హత లేదు : ఆనం

చంద్రబాబుకు అర్హత లేదు : ఆనం

ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేసే అర్హత చంద్రబాబుకు లేదని వైసీపీ నేత ఆనం  రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నాలుగున్నర ఏళ్లపాటు ప్రత్యేక ప్యాకేజీ అని వంతపాడి.. ఎన్నికల ముందు హోదా అంటూ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.  ప్రధాని హోదాలో ఏపికి వచ్చిన మోడీని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని,  కనీస మర్యాద కూడా చేయకుండా రాష్ట్ర పరువును తీశారని ఆనం మండిపడ్డారు. పోలవరం విషయంలో కేంద్ర నిధులను కాజేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.