టీడీపీ అభ్యర్థి కారుపై వైసీపీ రాళ్ల దాడి

టీడీపీ అభ్యర్థి కారుపై వైసీపీ రాళ్ల దాడి

గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిరెడ్డి కారుపై వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం రాళ్ల దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.