చంద్రగిరిలో యదేచ్ఛగా డబ్బుల పంపిణీ

చంద్రగిరిలో యదేచ్ఛగా డబ్బుల పంపిణీ

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ ప్రకటన వెలువడిన వెంటనే పార్టీ కార్యకర్తలు తాయిలాలకు తెర లేపారు. రీపోలింగ్‌ జరగనున్న కొత్తకండ్రిగ-316 పోలింగ్‌ బూత్‌ పరిధిలోని గణేశ్వరపురం, ఎన్‌టీఆర్‌ యానాదికాలనీలో  వైసీపీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. ఓటుకు రెండు నుంచి మూడు వేలు పంచుతున్న వైసీపీ కార్యకర్తలను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి 26 వేల నగదను స్వాధీనం చేసుకున్నారు. .నగదును పంచిన ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేశామని మిగతా వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.