డబ్బులు పంచుతూ దొరికిన వైసీపీ కార్యకర్తలు

డబ్బులు పంచుతూ దొరికిన వైసీపీ కార్యకర్తలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవకర్గంలో రీపోలింగ్‌ జరగాల్సిన గ్రామాల్లో వైసీపీ నేతలు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు రూ.3 వేలు చొప్పున పంచుతున్న పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు పంపిణీ చేస్తున్న వైసీపీ నేతలను స్థానికులు అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు డబ్బు పంచుతున్న వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 19న చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే.