రాష్ట్రపతిని కలిసిన వైసీపీ నాయకులు 

రాష్ట్రపతిని కలిసిన వైసీపీ నాయకులు 

వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి, అనంతరం ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతికి వివరించారు. ఈ ఘటనపై నిష్పపాక్షిక విచారణ జరగాలంటే.. థర్డ్‌ పార్టీతో కేసు దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతికి విన్నవించారు. అనంతరం వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, తమ అభ్యర్థనపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని తెలిపారు. భారత రాష్ట్రపతిని కలిసిన బృందంలో వైసీపీ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.