వైసీపీ అభ్యర్థులకు ఇవాళ శిక్షణ

వైసీపీ అభ్యర్థులకు ఇవాళ శిక్షణ

ఓట్ల కౌంటింగ్‌ రోజు అనుసరించాల్సిన విధానాలపై పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎలెక్షన్‌ ఏజెంట్లకు వైసీపీ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది.  విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. లెక్కింపును ఏ విధంగా పర్యవేక్షించాలి, అవకతవకలను అధికారుల దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లి ప్రశ్నించాలి వంటి అంశాలపై శిక్షణనిస్తామని నేతలు చెప్పారు.  నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.