కూల్చేయడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా ?

కూల్చేయడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా ?

ఢిల్లీ వెళ్లి వైసీపీ ప్రభుత్వం కూల్చేందుకు ప్రయత్నిస్తానన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చేస్తే కూలిపోవడానికి ఇది సినిమా సెట్టింగు కాదని ఎద్దేవా చేశారు. కోట్లాది మంది అండ కలిగిన వైఎస్‌ జగన్‌ ను, వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరూ ఏం చేయాలేరన్నారు. అసెంబ్లీలో జోగి రమేష్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీని కూల్చేస్తామని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో నిర్బంధిస్తామని అన్న కాంగ్రెస్‌, టీడీపీలు కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు. ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్‌ జగన్‌ వెంట ఉన్నారని చెప్పారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా సీఎం జగన్‌ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. అమ్మ ఒడి పథకం పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని రమేష్‌ అన్నారు.