రాష్ట్రంలో వ్యవసాయం నాశనమైంది

రాష్ట్రంలో వ్యవసాయం నాశనమైంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సీఎం చంద్రబాబు నాశనం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ ర్యాలీలో పాల్గొన్న ఆమె.... ప్రజల్ని మభ్యపెట్టడం చంద్రబాబుకు అలవాటైపోయిందని విమర్శించారు.  4 లక్షల ఎకరాల్లో  సేంద్రియ వ్యవసాయం చేయించలేక పోయిన సీఎం.. అమెరికాలో వ్యవసాయంపై సూక్తులు చెప్పడం హాస్యాస్పదం అని ఎద్దేవ చేశారు. జన్మభూమి కమిటీల్లో రౌడీలను పెట్టి అర్హులకు పథకాలు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు బాక్సైట్ పై ఉన్న ప్రేమ వల్లే మన్యంలో ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలను నక్సల్స్ బలితీసుకున్నారని రోజా పేర్కొన్నారు.  నిరుద్యోగ భృతి పేరుతో ఆశలు కల్పించి, యువతను చంద్రబాబు మోసం చేశారని ఆమె విమర్శించారు.