ఆయన అన్న కాదు... దున్న: రోజా

ఆయన అన్న కాదు... దున్న: రోజా

చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు, వైసీపీ నేత రోజా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో రోజా ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఎమ్మెల్యే రోజాకు తీర్థ ప్రసాదాలు అందించారు.

బయటకు వచ్చిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు సమీపిస్తుండడంతో సీఎం చంద్రబాబు పథకాల పేరుతో ఓట్లు కోనుగోలు చేస్తూన్నారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాను అని మోసం చేసిన చంద్రబాబును.. మహిళలు అన్నా అని కాదు దున్నా అని పిలుస్తారని రోజా అన్నారు.