మాకు లాలూచీలు లేవు

మాకు లాలూచీలు లేవు

ప్రత్యేక హోదాను ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోలేదు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలుస్తామని, ఆమె తప్పనిసరిగా తమ రాజీనామాలను ఆమోదిస్తారన్నారు. మనకు న్యాయంగా రావాల్సిన వాటిపై సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లడటం లేదన్నారు. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం విడ్డురం అని మేకపాటి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది వైసీపీ పార్టీనే.. హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కలిశారని గుర్తు చేశారు. జగన్ వలనే బాబులో ప్రత్యేక హోదాపై చలనం వచ్చిందన్నారు.

చిత్త శుద్ధిగా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు.. అంతేకాని వేరే లాలూచిలు లేవు మాకు అని మేకపాటి తెలిపారు. ప్రత్యేక హోదాను బాబు ఎప్పుడూ పట్టించుకోలేదు.. బీజేపీ ఏది చెబితే దానికి తలాడిస్తూ వచ్చారని విమర్శించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు అని మేకపాటి ఎద్దేవా చేశారు. బాబుకు అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచుకునేదానిపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదాపై లేదన్నారు. వైసీపీ నుంచి మీరు తెచ్చుకున్న ఎమ్మెల్యేల సంగతి మర్చిపోయారా.. వాళ్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని మేకపాటి ప్రశ్నించారు.