ఉపరాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీ

ఉపరాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీ

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన కుటుంబంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా ప్రమాణస్వీకారానికి ముందే ఉపరాష్ట్రపతి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చానని.. మర్యాదపూర్వకంగానే ఆయనతో భేటీ అయినట్లు తెలిపారు. పార్టీలకు అతీతం కాబట్టే ఉపరాష్ట్రపతిని కలిసినట్లు ఆయన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయనతో సన్నిహితంగా తిరుగుతూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హజరుకావాలని ఉపరాష్ట్రపతి సూచించారని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.