10 అంశాలపై చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి...!

10 అంశాలపై చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి...!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రోజుకో బాంబ్ పేలుస్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి... ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు 10 అంశాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలంటూ మరో బాంబ్ పేల్చారు సాయిరెడ్డి... చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ నిప్పు లాంటి చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని... మరి పప్పు సంగతి నాకు తెలియదంటూ నారా లోకేష్‌ని ఉద్దేశించి వ్యాఖ్యాలు చేశారాయన. పార్లమెంట్ సెంట్రల్ హల్లో ఆ పార్టీ ఎంపీలు... ఇతర పార్టీ ఫ్లోర్ లీడర్లను కలసి చంద్రబాబును కలవాలని బ్రతిమిలాడుతున్నారని విమర్శలు చేసిన సాయిరెడ్డి... చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదంటూ వ్యాఖ్యానించారు. నేను ఎప్పుడూ వైఎస్ కుటుంబం మనిషినేనన్నారు విజయసాయిరెడ్డి... నేను వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తే రాజ్యసభ ఎంపీ అయ్యానని... లోపాయికారి ఒప్పందాలు చేసుకునే అలవాటు నిప్పు... పప్పులకు మాత్రమే ఉందంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారాయన... లోకేష్ కు అన్యాయం, అక్రమం, అవినీతి అనే శాఖలను చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపణలు చేసిన సాయిరెడ్డి... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై చంద్రబాబు, లోకేష్ స్పందించాలని డిమాండ్ చేశారు... ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై సాయిరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల కోసం పై వీడియోను క్లిక్ చేయండి...