బాబు ఎకౌంట్లో రూ.10 వేల కోట్లు ఎక్కడివి...!

బాబు ఎకౌంట్లో రూ.10 వేల కోట్లు ఎక్కడివి...!
ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారని, ప్రత్యేక హోదా సాధన విషయంలో బాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు విజయసాయిరెడ్డి. తాజాగా ఆయన విశాఖపట్టణంలో మాట్లాడుతూ.. బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు గతవారం రోజులుగా ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్టణంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని విజయసాయిరెడ్డి ఈరోజు సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదా ఇచ్చినటువంటి పదకొండు రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఉద్యోగావకాశాలు ఏ విధంగా పెరిగాయనే విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకి ఎర్రచందనం స్కాంలో పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. అందులో బాబు ఎకౌంట్లో రూ. 10వేల కోట్లు డిపాజిట్ అయ్యాయని వివరిచారు. ఇంకా విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.